వెంకీ కొత్త బిజినెస్.. అంతా ఎలక్ట్రికే !

విక్టరీ వెంకటేష్ బిజినెస్ మేన్ కాదు. ఎప్పుడూ ఆయన ఆర్థిక వ్యవహారాల్లో దల దూర్చరు. సురేష్ ప్రొడక్షన్స్ వ్యవహారాలన్నీ సురేష్ బాబునే చూసుకుంటారు. అంత వస్తుంది ? ఎంత పోతుంది ? అనే లెక్కలు కూడా వెంకీ పట్టించుకోరు. అలాంటి వెంకీ కొత్త బిజినెస్ లోకి దిగాడు. ఎలక్ట్రిక్ వాహ‌న రంగంలోకి అడుగు పెట్టాడు.

హైద‌రాబాద్ కు చెందిన ఎలిక్ట్రిక్ వెహిక‌ల్ స్టార్ట‌ప్ కంపెనీ అయిన బైక్ వో లో హీరో వెంక‌టేష్ పెట్టుబ‌డులు పెట్టాడు. ఇది ఈవీ టూ వీల‌ర్ స్మార్ట్ హ‌బ్ నెట్ వ‌ర్క్ గా ఉంటుంది. ఈ కంపెనీ ఈవీ రంగంలో ఉండే బైక్ లకు ఛార్జింగ్ తో పాటు స‌ర్వీసింగ్ వంటి స‌దుపాయాల‌ను కల్పింస్తుంది.

ఈ బైక్ వో కంపెనీ 2025 వ‌ర‌కు దేశ వ్యాప్తంగా విస్త‌రించాల‌ని ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా 20,000 ఎల‌క్ట్రిక్ వాహ‌న ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాడానికి రంగం సిద్ధం చేస్తుంది. వెంకీ బిజినెస్ పార్ట్నర్ మాత్రమే కాదు. ఈ బైక్ వో కంపెనీకి పార్ట్ న‌ర్ గానే కాకుండా బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కూడా. ఇక సినిమాల విషయానికొస్తే.. సంక్రాంతికి రావాల్సిన నవ్వుల చిత్రం ఎఫ్ 3 సమ్మర్ కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.