14 నుంచి ఓటీటీలో #PushpaHindi

థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘పుష్ప’ సినిమా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ బాషల్లో పుష్ప అందుబాటులో ఉంది. ఇప్పుడు పుష్ప హిందీ వర్షన్ న్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఈ నెల 14 నుంచి పుష్ప హిందీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. వారం రోజుల ఆలస్యంగా హిందీ పుష్ప ఓటీటీలోకి రానుంది. బాలీవుడ్ లో పుష్ప కలెక్షన్స్ బాగుండటంతో.. ఓటీటీ రిలీజ్ ను ఓ వారం ఆలస్యం చేశారు.

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. బన్నీకి జంటగా రష్మిక మందన నటించింది. స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ లో మెరిసింది. మలయాళ స్టార్ ఫాహిద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించారు. సునీల్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మైత్రీ మూవీస్ నిర్మించింది. సోమవారంతో పుష్ప 25 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్స్ రూ. 300కోట్లు దాటేశాయి. బాలీవుడ్ లో ఏకంగా రూ. 70కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.