చేత‌కాకే కేసీఆర్ కాడి కింద‌ప‌డేశారు..!

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తు సంకేతాల‌పై తెలంగాణ జ‌న‌స‌మితి అధినేత కోదండ‌రాం విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ఒక్క పెన్నుపోటుతో ప్రభుత్వం చిన్న రైతుల ఉనికి లేకుండా చేస్తోందని, భూమి నుంచి వేరు చేసి బ్రతుకులేకుండా చేస్తోందని ఆయ‌న అన్నారు. కౌలు దారులమీద సీఎం విషం కక్కుతున్నాడని, ఆయ‌న ఫ్యూడ‌ల్ త‌త్వంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. చిన్న రైతులకు అండగా టీజేఎస్ ఉంటుందని, వారికి అండగా పోరాటం ఉదృతం చేస్తామ‌ని భరోసా ఇచ్చారు.

డీలర్లను పిలిచి మాట్లాడాలి సమస్య పరిష్కరించకుండా వారి మీద విరుచుకుపడటం ఎందుకని ఆయ‌న ప్ర‌శ్నించారు.
వేములకొండ బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్ఫర్స్ పేరుతో డబ్బులు తింటున్న పాలన ఇప్పుడు చూస్తున్నామ‌ని, కేసీఆర్ పాలన చేతకాకనే నాలుగున్నరేళ్లకే దిగిపోతఅంటున్నారని విమ‌ర్శించారు. అందుకే కేసీఆర్ కాడి కింద పడేశారన్నారు. టీఆర్ఎస్ కు తామే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని ఉద్ఘాటించారు.