భలే ఎగిరింది.. సామ్ జిమ్ వీడియో వైరల్ !
పెళ్లినా సమంత ఫిగర్ మారలేదు. ఫర్ ఫెక్ట్ షేపులోనే ఉంది. దానికి కారణం ఆమె జిమ్ లో విపరీతంగా కష్టపడుతుంటుంది. చెమటలు కక్కిస్తుంటుంది. సైజులు తగ్గిస్తుంటుంది. ఈ క్రమంలో సామ్ కు సంబంధించిన పలు జిమ్ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయి.
తాజాగా సామ్ నుంచి మరో జిమ్ వీడియో వచ్చింది. ఇందులో సామ్ కింద మోకాళ్లపై కూర్చొని.. ఎగిరి నిలబడటం చూడొచ్చు. ఇలా పలు మార్లు చేసినా.. సామ్ ఏమాత్రం అలసిపోలేదు. మరింత ఉత్సాహంగా కసరత్తులు చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఐటమ్ సాంగ్ ‘ఊ అంటావా మావా’లో మెరిసింది. ఇందులో సామ్ అందచందాలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉన్నాయి.
ఇక ఇప్పటికే శాకుంతలం సినిమాని పూర్తి చేసిన సామ్.. ప్రస్తుతం యశోధ సినిమాలో నటిస్తున్నది. మరోవైపు ఓ ఇంటర్నేషన్ ప్రాజెక్ట్ తో పాటు. పలు హిందీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
Here’s Samantha showing us some serious fitness goals!!🔥💪@Samanthaprabhu2 #SamanthaRuthPrabhu #Samantha #fitness pic.twitter.com/bLCoVEuVjs— Shreyas Group (@shreyasgroup) January 11, 2022