రైతులకు కేసీఆర్ సర్కార్ రూ. 2వేల పింఛన్
తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతుందా ? ప్రతి రైతుకు రూ. 2వేల పింఛన్ ఇవ్వబోతుందా ? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రైతుల కోసం రైతుబంధు, రైతు భీమా పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్.. వారి కోసం మరో పథకాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. 47 ఏళ్లు దాటిన ప్రతి రైతుకు నెలనెలా పింఛన్ ఇవ్వడంపై కసరత్తు చేస్తున్నారట. ఈ పథకాన్ని వచ్చే ఎన్నికల అస్త్రంగా మార్చాలని వ్యూహాలు రచిస్తున్నారట.
మరోవైపు కేసీఆర్ కొత్త పథకాలను తీసుకురావడమే తప్పా.. వాటిని సమర్థవంతంగా అమలు చేసే దాఖలాలు లేవని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. దళిత సీఎం విషయంలో మాట తప్పిన సీఎం కేసీఆర్… దళితులకు మూడెకరాల భూమి హామీని మర్చిపోయాడు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సంగతి పట్టించుకోవడమే మానేశాడు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దళితబంధు విషయంలోనూ సర్కారు ఫెయిల్ అనే విమర్శలు ఉన్నాయి. అయితే దళితబంధు డ్యామేజ్ ని అధిగమించడం కోసమే రైతులకు ఫించన్ అంటూ కొత్త పథకానికి ఆలోచన చేస్తున్నట్టున్నాడనే విమర్శలు అప్పుడే మొదలయ్యాయి.