అద్భుతం యాదాద్రి శిల్పాలు…
స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు కొలువైన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కృష్ణ శిలల నుంచి జీవం పోసుకున్న అద్భుత కళాఖండాలు, ఆధ్యాత్మికతను పంచే ముఖమంటపం, బాలపాద స్తంభాలు, గజరాజులు-సింహాలు, గోడలపై లతలు, పద్మాలు.. ఒకదాన్ని మించినట్లున్న మరొకటి అన్నట్లుగా ఉన్నాయి అక్కడి కళాఖండాలు..
కాకతీయులు, చోళ, పల్లవ శైలి నిర్మాణాలతో నారసింహుడి సన్నిధిని రూపుదిద్దుకుంటోంది. ప్రధాన ముఖ మంటపంలో భక్తప్రహ్లాదుడు, క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి, మహారుషి యాదర్షి, శ్రీవైష్ణవ ధర్మ ప్రచార అగ్రగణ్యులైన 12 మంది ఆళ్వార్ స్వాముల మూర్తులు కొలువుదీరుతున్నారు. దాదాపు 2.11 ఎకరాల విస్తీర్ణపు ప్రధాన ఆలయ నలుదిశలా అష్టభుజి బాహ్య ప్రాకారం మంటప నిర్మాణం జరుగుతోంది. అష్టభుజి మంటప ప్రాకారానికి లోపలి వైపు యాలీ పిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారు.