పీకేతో 300కోట్ల డీల్
టీఆర్ఎస్ రాజకీయ వ్యూహకర్తగా నిన్నటి దాకా పనిచేసిన సునీల్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ (పీకే) ను నియమించుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఐప్యాక్ టీమ్ తెలంగాణలో పనిచేసేందుకు రూ.300 కోట్లు రూపాయల ప్యాకేజ్ తో పీకేతో ఒప్పందం కుదిరించుకున్నారని సమాచారం. అంతేకాదు.. ఈసారి కూడా ఆరు నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలకు ముందే అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేసుకోవాలని ఆయన ఆలోచన.
ఒక వైపు రోజురోజుకి ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత మరో వైపు బీజేపీతో వైరం. ఈ రెండు కారణాలతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని కేసీఆర్ వ్యూహంగా కనబడుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలకు ముందు దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని అన్ని మండలాలలో ఒక్కొక్క గ్రామంలో ప్రారంభించి దళితులను నమ్మించే ప్రయత్నం చేయాలని కేసీఆర్ వ్యూహం అని కూడా చెబుతున్నారు. మరోవైపు 47 ఏళ్లు దాటిన రైతులకు ఫించన్ అనే కొత్త పథకానికి కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తున్నది.
ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు తమ కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత కూడా రోజురోజుకు పెరుగుతుంది అని కేసీఆర్ గుర్తించాడని అర్థం అవుతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. హుజూరాబాద్ లో ఈటెల గెలవడం కేసీఆర్ కు ఆందోళన మొదలైంది అని అంటున్నారు. హుజూరాబాద్ ఎన్నికలలో డబ్బు అధికార ఒత్తిళ్లు ప్రలోభాలు పనిచేయలేదని కేసీఆర్ గుర్తించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆలస్యం విషయం కానుంది. అందుకే ఈ సారి కూడా ముందడుగు వేయాలని.. ప్రతిపక్షాలు అలర్ట్ అయ్యేలోపు పని కానిచ్చేయాలి. హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.