హాటీగా మారిన క్యూటీ

నాని ‘జెంటిల్ మేన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది నివేధా థామస్. నిన్నుకోరి, జై లవ కుశ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది. ఆ తర్వాత బ్రోచేదెవరురా, 118 సినిమాలు ఆమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. క్యూట్ క్యూట్ గా కనిపించే నివేదా పండగ పూట హాట్ గా కనిపించింది. రెడ్ కలర్ శారీ, బ్లూ కలర్ జాకెట్ లో ఆమె అందాలు డబుల్ అయ్యాయి. ఇప్పుడీ.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం నివేదా మీట్ క్యూట్, శాకినీ దాకినీ సినిమాల్లో నటిస్తుంది. లేడీ కమల్ హాసన్ గా గుర్తింపు తెచ్చుకున్న నివేదాకు వరుస ఆఫర్లు వస్తున్నయి. అయితే గ్లామర్ విషయంలో ఇంకాస్త శ్రద్ద వహిస్తే.. స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరడం ఖాయం. ప్రస్తుతం.. ఈ బ్యూటీ ఆ పనిలోనే ఉన్నట్టు కనిపిస్తున్నది.