బీజేపీ బహుజన పాదయాత్ర.. 2 నెలలు.. మిషన్-19 !

తెలంగాణలో బీజేపీకి బలం పెరిగింది. ఈ బలాన్ని పూర్తిస్థాయిలో ఓటు బ్యాంకుగా మార్చుకొని.. వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ను గట్టిగా ఢీకొనాలని ఇప్పటి నుంచే ప్రణాఌకలు రచిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న మొత్తం 19 ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు కృషి చేయాలని బీజేపీ కొంతకాలం క్రితమే పార్టీ శ్రేణులకు సూచించింది. ఇందుకోసం ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై “మిషన్ -19” పేరుతో సమీక్షలు కూడా నిర్వహించింది.

ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల విషయంలో తాజాగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కీలక కార్యాచరణ ప్రకటించింది. బీజేపీ ఎస్సీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అధికారంలోకి రావాలంటే ఎస్సీ నియోజకవర్గాలే కీలకమని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 14 నుంచి ఎస్సీ నియోజకవర్గాల్లో బహుజన పాదయాత్ర పేరిట 2 నెలల పాటు పాదయాత్ర చేపట్టబోతున్నట్టు వెల్లడించారు.  పేరిట 2 నెలల పాటు పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు, ఈ 19 స్థానాల్లో బలమైన అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా జరుగుతున్నట్టు సమాచారం.