పాయల్.. ఓన్లీ కమర్షియల్ !
‘ఆర్ఎక్స్100’ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది పాయల్ రాజ్ పుత్. కానీ ఆ క్రేజ్ ను ఆమె సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయింది. కథలు, బ్యానర్ల ఎంపికలో తప్పటడుగులు వేసింది. మంచి పాత్రలు, బడా హీరోల కోసం ఎదురు చూడకుండా ఐటెంసాంగ్స్ చేసింది. తొందరగా షెడ్డుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకుంది. ఒంటి నిండా అందం నింపుకున్న ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ మాత్రం లేదు. ఇక భవిష్యత్తులో రాదని కూడా తేలిపోయింది. దీంతో పేమెంట్ పై దృష్టి పెట్టింది పాయల్. పైసలిస్తే చాలు.. ఏం చేయడానికైనా రెడీ అంటోంది. కథ ఏదైనా, అందులో హీరో ఎవరైనా, దర్శకుడు ఎవరైనా కాల్షీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఓపెన్ ఆఫర్ అన్నమాట. పేమెంట్ ఇచ్చి.. ఎలా కావాలంటే.. అలా వాడుకోండని చెబుతుంది. ఉన్నంతలో రెమ్యూనరేషన్ పిండుకోవాలని ఫిక్స్ అయింది. మొహమాటానికి పోయి కాల్షీట్లు ఇవ్వడం లేదు. అటుఇటుగా 40 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తేనే సినిమాకు ఓకే చెబుతోంది.