మెగా డాటర్ బ్రేకప్ బెల్స్ ?

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ నుంచి భర్త పేరును తొలగించింది అన్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. నిన్నటి వరకు శ్రీజ కళ్యాణ్ అని వుండేదని, ఇప్పుడు లేటెస్ట్ గా శ్రీజ కొణిదెల అని మార్చినట్లు తెలుస్తోంది. 2020 ఏప్రిల్ తరువాత శ్రీజ అక్కౌంట్ లో ఒక్కటి కూడా కళ్యాణ్ ధేవ్ ఫొటో లేదు. మిగిలిన మెగా హీరోల ఫొటోలు అన్నీ దర్శనమిస్తున్నాయి.

కళ్యాణ్ దేవ్ నటించిన ‘సూపర్ మచ్చి’ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమాను మెగాక్యాంప్ పట్టించుకోలేదు. ప్రమోషన్ సంగతి పక్కనబెడితే.. కనీసం నోటి నుంచి ఆ సినిమా పేరును ఎక్కడా పలకలేదు. అసలు కళ్యాణ్ ధేవ్ ఇండియాలో వున్నారో, అమెరికాలో వున్నారో కూడా తెలియరాలేదు.

ఇటీవల మెగాస్టార్ ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కూడా కళ్యాణ్ ధేవ్ కనిపించలేదు. ఇవన్నీ గమనిస్తున్న జనాలు మెగా డాటర్ బ్రేకప్ బెల్స్ మ్రోగుతున్నాయా ? అంటూ డౌటు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బహుశా.. అంత వరకు వచ్చి ఉండకపోవచ్చు. కానీ కొంత గ్యాప్ అయితే కనిపిస్తుందని మెగా అభిమానులు సైతం అంగీకరిస్తున్నారు.