సమంతతో ఒకేసారి మూడు..

స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతుంది. ఈ మేరకు అటు వైపు ప్రయత్నాలు కూడా షురు చేసింది. ఈ క్రమంలో బాలీవుడ్ నుంచి సామ్ కు బంపర్ ఆఫర్ ఒకటి వచ్చింది. దేశంలోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్, ఏళ్లనాటి చరిత్ర కలిగిన యష్ రాజ్ ఫిలిమ్స్ సమంతతో బిగ్ డీల్ చేసుకుందట. ఏకంగా రూ. 20కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసింది. అయితే ఇదంతా ఒకే ఒక్క సినిమా కోసం కాదు. వరుసగా మూడు సినిమాలకు సామ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం బాలీవుడ్ నుంచి ఏలుతున్న స్టార్ హీరోలకు మైలేజ్ ఇచ్చింది యష్ రాజ్ ఫిల్మ్స్ నే. ఇప్పుడీ.. ఈ బ్యానర్ సమంతతో డీల్ కుదుర్చుకోవడం గొప్ప విషయం. ఇక ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ తో సామ్ బాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరైంది. పుష్ప ఐటమ్ సాంగ్ తో తనలోని హాట్ నెస్ ని కూడా పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నుంచి సామ్ కు వరుసగా ఆఫర్లు క్యూ కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.