సలార్ సింగిల్ ఫైట్ కోసం 20 కోట్లు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో ‘సలార్’ ఒకటి.  కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్.  ప్రస్తుతం ఈ సినిమా  వేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం రూ.20 కోట్లతో భారీ ఫైట్ సీన్ షూట్ చేసినట్టు ప్రచారం జరిగింది. ఇదే ఈ సినిమాకి హైలైట్ కానుందని సమాచారం.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంది. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలివేషన్ సీన్స్ తీయడంలో ప్రశాంత్ నీల్ దిట్ట. ఆయన పనితనం కేజీఎఫ్ పార్ట్ వన్ లో చూశాం. కేజీఎఫ్ 2లో చూడబోతున్నాం. అయితే.. కేజీఎఫ్ ని మించిలా సలార్ లో యాక్షన్ సీన్ ఉండబోతున్నట్టు సమాచారం.