ఆ కేసులో దాసరి కొడుకు అరెస్ట్

దర్శకరత్న దాసరి నారాయణ రావు చిన్న కొడుకు, హీరో దాసరు అరుణ్ అరెస్ట్ అయ్యారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారని సమాచారం. 

శుక్రవారం తెల్లవారుజామున  4 గంటల సమయంలో అరుణ్‌ కుమార్ కారు ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ రెండు బైక్‌లను ఢీ కొట్టాడు. ఈ ఘటన సయ్యద్‌ నగర్‌లో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. అరుణ్ ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అరుణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోలేకపోయాడు. సినిమాల్లో నిలదొక్కుకోలేకపోయాడు. తండ్రి మరణించిన తర్వాత అన్నదమ్ముల ఆస్తి పంచాయతీ పలుమార్లు వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే.