ధనుష్ కు రజనీ క్లీన్ చీట్
ధనుష్, ఐశ్వర్య రజనీ కాంత్ విడిపోయారు. తమ 17 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు ఈ నెల 17 అర్థరాత్రి సమయంలో ఉమ్మడి ప్రకటనను విడి విడిగా షేర్ చేశారు. ఈ షాకింగ్ న్యూస్ తో రజనీ, ధనుష్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. మరోవైపు ధనుష్-ఐశ్వర్య, ధనుష్-రజనీలకు సంబంధించిన స్వీట్ మెమోరీస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ధనుష్ ఐశ్వర్య కోసం పాట పాడిన వీడియోతో పాటు కాలా ఫంక్షన్ లో ధనుష్ గురించి రజనీ గొప్పంగా చెప్పిన వీడియోలు వైరల్ అయ్యాయి.
‘కాలా’ సినిమా మ్యూజిక్ లాంచ్ సమయంలో రజనీకాంత్ తన అల్లుడు ధనుష్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ధనుష్ “మంచి” తండ్రి , భర్త అని చెప్పిన వీడియో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతుంది. “ధనుష్ అద్భుతమైన అబ్బాయి. తన తల్లిదండ్రులను గౌరవిస్తాడు, వారిని దేవుడిగా భావిస్తాడు. భార్యను చూసుకుంటాడు. మంచి తండ్రి, మంచి అల్లుడు, మంచి మనిషి, మంచి ప్రతిభ గలవాడు” అని రజనీకాంత్ వీడియోలో పేర్కొన్నారు. దీంతో అల్లుడికి రజనీ క్లీన్ ఇచ్చాడని.. మరీ ఇప్పుడు ఏమైందని అభిమానులు అడుగుతున్నారు.
Apart From Trolls. Feeling sad For Rajini. Stay Strong 🙏 #Dhanush #DhanushDivorce #Divorce @dhanushkraja#Beast #Thalapathy66 @actorvijay pic.twitter.com/3brl7XYWNu— பாண்டி💙❤💚 (@PandiyanKpm) January 18, 2022