ఆహా.. హోస్ట్ గా అల్లు అర్జున్

వెండితెరను మాత్రమే కాదు.. బుల్లితెరను స్టార్ హీరోలు ఏలుతున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై ఒకటికి రెండు సార్లు మెరిశాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1కి హోస్ట్ గా వ్యవహరించారు.

ఆ తర్వాత జెమినీ టీవీ కోసం ఎవరు మీలో కోటీశ్వరులు షోకి హోస్ట్ గా చేశారు. అబ్బాయ్ కి పోటీగా బాబాయ్ అన్నట్టు తెలుగు ఓటీటీ ఆహా కోసం బాలయ్య హోస్ట్ గా మారారు. ‘అన్ స్టాపబుల్’ తో అదరగొట్టేశారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా హోస్ట్ గా మారబోతున్నట్టు సమాచారం.

ఆహా కొసం ఓ స్పెషల్ టాక్ షోని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది వరకు ఎవరు టచ్ చేయని కాన్సెప్ట్ తో స్టార్స్ ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి బన్నీకి హోస్ట్ గా చేయబోతున్నాడని టాక్. మరీ.. ఈ టాక్ నిజమవుతుందేమో చూడాలి.