విడాకులను రద్దు చేసుకున్న చై-సామ్ ?
అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్ అందబోతుందా ? విడాకులు తీసుకుంటున్నట్టు పకటించిన నాగ చైతన్య-సమంత దంపతులు మళ్లీ కలవబోతున్నారా ? అంటే.. అందుకే అవకాశం ఉన్నట్టు సామ్ చేసిన పనితో అర్థమవుతోంది. నాలుగు నెలల క్రితం బ్రేకప్ పై చై-సామ్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ప్రకటనని విడి విడిగా పోస్ట్ చేసారు. ఇప్పుడీ.. ఈ ప్రకటనని సామ్ తన ఇన్ స్టా హ్యాండిల్ నుంచి తొలగించడం హాట్ టాపిక్ గా మారింది.
ఇంకా చై-సామ్ కు అఫీషియల్ గా విడాకులు మంజూరు కాలేదనే వార్తలు అప్పట్లోనే వినిపించాయి. విడిపోయిన తర్వాత కూడా చై-సామ్ ఒకరినొకరు గౌరవించుకున్నారు. బ్రేకప్ డిసిషన్ బెస్ట్ డిసిషన్. విడిపోయి ఇద్దరు హ్యాపీగా ఉన్నామని బంగర్రాజు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగ చైతన్య అన్నారు. సమంత మాత్రం ఇప్పటి వరకు నోరు తెరవలేదు. బ్రేకప్ కు రీజన్ చెప్పలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టు ఉండి బ్రేకప్ నోటీసును డిలీట్ చేయడంతో.. ఆమెకు ఇంకా చైతూపై ప్రేమ తగ్గలేదని అర్థమవుతుంది. ఈ జంట మళ్లీ కలిసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అక్కినేని అభిమానుల మనసుల్లో ఎక్కడో మూలన ఓ చిన్న ఆశ చిగురించినట్టు ఉంది.