కాంగ్రెస్ స్థానంలోకి ఆమ్ ఆద్మీ
దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ రోజురోజుకి ప్రభ కోల్పోతుంది. ఆ పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఏ కోశాన కనిపించడం లేదు. మరోవైపు హస్తం పార్టీ ఫెల్యూర్ ని రెండు చేతుల్లా అందిపుచ్చుకొని సామాన్యుడు క్రేజీవాల్ దూసుకెళ్తున్నారు. దేశ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి పరుగులు తీస్తున్నాడు. ఇందుకోసం వచ్చే నెలలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఓ అవకాశంగా మలుచుకుంటున్నారు.
పంజాబ్ లో ప్రస్తుతం ఆప్ ది ప్రతిపక్ష పాత్ర. 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెక్ పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు మెండిగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గోవాలోనూ ఆ పార్టీకి ప్రజల ఆదరణ దక్కుతుంది.
క్రేజీవాల్ సరికొత్త వ్యూహాలతో గోవాలను అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేష్ లోనూ ఆప్ పోటీలో ఉంది. కొన్ని సీట్లు గెలుచుకునేలా కనబడుతుంది. మొత్తంగా ఎక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీకి షిఫ్ట్ అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంతే కాంగ్రెస్ స్థానంలోకి ఆప్ వచ్చేస్తుంది. ప్రతిపక్ష పాత్ర.. ఆ తర్వాత అధికారంలోకి రావడానికి.. దేశాన్ని పాలించడానికి ముందుకు వెళ్తున్నది.