పవన్ 2 నెలల డెడ్ లైన్
ఇప్పటి వరకూ సినిమా, రాజకీయం అంటూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడి పాత్ర పోషించాల్సివుంటుంది.
2024లో ఎన్నికల ఘంటారావం మోగనుంది. 2023లోనే ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ రాజకీయ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పడానికి సమాయాత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేయడం పవన్ కి పెద్ద టాస్క్. భీమ్లా నాయక్ పని అయిపోయింది. హరి హర వీరమల్లు
సినిమా సగం పూర్తయ్యింది. ఈ చిత్రానికి మరో 40 రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుంది.
ఆ తరవాత హరీష్ శంకర్ సినిమా లైనప్ లో ఉంది. ఆ సినిమాకి పవన్ 60 రోజులు కేటాయించబోతున్నాడట. రెండు నెలల్లో సినిమాని పూర్తి చేసుకోవాలని హరీష్ శంకర్‌కు డెడ్ లైన్ విధించాడని తెలుస్తోంది. హరీష్ కూడా వేగంగా సినిమాలు తీయడంలో దిట్ట. హరీష్ తర్వాత సురేందర్ రెడ్డి వంతు.
ఆయనకు 60 రోజుల డెడ్ లైనే. సూరి చేతిలో ఏజెంట్
ఉంది. అది పూర్తయ్యేలోగా పవన్ హరి హర వీరమల్లు
తో పాటుగా హరీష్ శంకర్ సినిమానీ అవ్వగొట్టాలి. పవన్ ప్లాన్ ఏమిటంటే… 2022లో మూడు సినిమాల్ని ఫినిష్ చేయాలి. అందుకే ప్రతి సినిమాకు 60 రోజుల టార్గెట్ అంటూ.. ఓ డెడ్ లైన్ పెట్టేశారు. ఈ గీత దాటితే నేనేం చేయలేనని పవన్ స్పష్టంగా చెప్పేశారట.