ఉత్త‌మ్ కు మంత్రి కేటీఆర్ ఛాలెంజ్..!!

టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ , మంత్రి కేటీఆర్ మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఒక‌రి పై ఒక‌రు విమ‌ర్శ‌ల వ‌ర్షం క‌రిపించుకున్నారు. మంత్రి కేటీఆర్ సోనియాపై చేసిన వ్యాఖ్య‌ల‌పై ఉత్త‌మ్ ట్వీట్ చేయ‌గా, దానికి కౌంట‌ర్ గా మంత్రి కేటీఆర్ రిట్వీట్ చేశారు. ఎక్క‌డా త‌గ్గ‌కుండా ఒక‌రిపై ఒక‌రు ఘాటు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన సోనియా గాంధీ ఎప్పటికి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని, దివాలాకోరు తనంగా మంత్రి కేటిఆర్ సోనియా పై అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఉత్త‌మ్ ట్వీట్ చేశారు. త్వరలో కేటిఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతార‌ని ట్విట్ట‌ర్ లో కౌంట‌ర్ ఇచ్చారు ఉత్త‌మ్.

సోనియా గాంధీ పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని, 1952 నుంచి 2014 వరకు మోసం, అబద్ధాలు, వంచనలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదంటూ మంత్రి కేటీఆర్ ఉత్త‌మ్ పై విరుచుకుప‌డ్డారు. ప్రజల పోరాటం వల్లే తెలంగాణ ఏర్పడింద‌ని, ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు నైతికంగా దివాలా తీస్తారో ప్రజలే నిర్ణయిస్తారంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. టిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాలను ఒదిలేస్తాన‌ని, ఈ మాటకు తాను కట్టుబడి ఉన్నాన‌ని, మరి ఉత్తమ్ కట్టుబడి ఉన్నారా అంటూ ట్విట్ట‌ర్ లో ఉత్త‌మ్ కు కౌంట‌ర్ ఇచ్చారు.