బడా నేతలు.. సేఫ్ జోన్
యూపీ ఎన్నికల్లో బడా నేతలు సేఫ్ జోన్ లను ఎంచుకుంటున్నారు. ప్రయోగాలు చేసేందుకు అస్సలు ఆసక్తి చూపడం లేదు. సీనియర్ నేతలు, ముఖ్యమంత్రి అభ్యర్థులది ఇదే తీరు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తనకు, తమ పార్టీకి గట్టి పట్టున్న గోరఖ్‌పుర్ అర్బన్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. మెజార్టీ విషయంలో కొత్త రికార్డు నెలకొల్పడంపై ఆయన కన్నేశారు.
సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ మైన్‌పురి లోక్‌సభ పరిధిలోని కర్‌హల్ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. ఎస్పీకి సురక్షిత సీటుగా దీనికి పేరుంది. డిప్యూటీ సీఎం, రాష్ట్రంలో భాజపా అగ్రనేతల్లో ఒకరైన కేశవ్‌ప్రసాద్ మౌర్య సిరాథూ నుంచి పోటీ చేయనున్నారు. మొత్తానికి బడా నేతలు సేఫ్ జోన్లను చూసుకుంటున్నారు. పార్టీ ఓడిపోయినా పర్వాలేదు. కానీ పర్సనల్ ఓడిపోతే పరువుతుందని వారు సేఫ్ జోన్లకే ఓటేస్తున్నారు.