కొత్తగా గోల్డ్ సేవింగ్స్ అకౌంట్స్.. కేంద్రం నిర్ణయం ?
కేంద్రం మరో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా గోల్డ్ సేవింగ్స్ అకౌంట్స్‌ను తీసుకురావాలని యోచిస్తోందని సమాచారం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గోల్డ్ సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటంటే ? సార్వభౌమ పసిడి పథకం లాంటిదే గోల్డ్ సేవింగ్స్ అకౌంట్స్. కాకపోతే గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అదే సేవింగ్స్ అకౌంట్స్ అయితే రోజూ అందుబాటులో ఉంటుంది. గ్రాము బంగారానికి సమాన మొత్తంలో నగదును బ్యాంకులోని గోల్డ్ సేవింగ్స్ అకౌంట్స్‌లో మదుపు చేయొచ్చు.
గ్రాము నుంచి ఎంత వరకైనా ఇందులో డిపాజిట్ చేయొచ్చు. తిరిగి నగదును ఉపసంహరించుకునేటప్పుడు ఆ రోజు ధర ఆధారంగా బ్యాంకులు చెల్లింపులు చేస్తాయి. దీనికి పాస్‌బుక్ కూడా జారీ చేస్తారు. ఈ ఖాతాలోని డిపాజిట్లపై గోల్డ్ బాండ్స్ తరహాలోనే 2.5 శాతం చొప్పున వడ్డీని బ్యాంకులు చెల్లిస్తాయని సమాచారం.