కోహ్లీ వల్లే.. టెస్టు క్రికెట్‌కు క్రేజ్ పెరిగింది
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ వల్లే టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరిగిందన్నాడు. “విరాట్ కోహ్లీ గొప్ప నాయకుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడి నాయకత్వంలోనే భారత్ టెస్టు క్రికెట్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. వ్యూహాల విషయంలో అతడు మెరుగు పడాల్సి ఉన్నా.. నాయకుడిగా కొనసాగినంత కాలం జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపాడు.
తన ఆటతీరుతో టెస్టు క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లిన తీరు చూశాక అతడిపై గౌరవం మరింత పెరిగింది. అతడో అద్భుతమైన క్రికెటర్. టెస్టు క్రికెట్‌కు గొప్ప రాయబారి. సుదీర్ఘ ఫార్మాట్ పట్ల అతడికి మక్కువ ఎక్కువ. ప్రస్తుత టీ20 క్రికెట్ యుగంలో కూడా టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరిగిందంటే అది కోహ్లీ వంటి గొప్ప ఆటగాళ్ల వల్లనే సాధ్యమైంది” అని షేన్ వార్న్ అన్నారు.