బాలయ్య కొత్త సినిమా లెటెస్ట్ అప్ డేట్

 బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అఖండ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా ఇది. మైత్రీ మూవీస్ నిర్మిస్తుంది. దీని కాస్ట్ అండ్ క్రూ కూడా అంతా ఫిక్స్ అయింది. సినిమా ఓపెనింగ్ జరిగిపోయింది. కానీ షూట్ మాత్రం బిగిన్ కావాల్సి వుంది. అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమా సెట్ మీదకు వెళ్లడానికి మరి కాస్త టైమ్ పడుతుందన్నది.

బాలయ్య ఇప్పుడిప్పుడే తన అన్ స్టాపబుల్ చాట్ షో నుంచి ఫ్రీ అయ్యారు. ఆయన పెండింగ్ లో వుంచిన పనులు చాలా వున్నాయని తెలుస్తోంది. దాంతో పాటు పలువురికి మాట ఇచ్చిన మేరకు కథలు వినాల్సివుందని తెలుస్తోంది. ఇవన్నీ ఫినిష్ చేసిన తరువాత గోపీచంద్ మలినేని సినిమా సెట్ మీదకు వెళ్తారని సమాచారమ్. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి సినిమా ను బాలయ్య స్టార్ట్ చేస్తారు.