మహేష్ సినిమాలో మోహన్ బాబు.. ఫిక్స్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారి వారి పాట తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన సినిమా ఉండనుంది. ఈ సినిమాకు సంబంధించి ఓ గ్యాసిప్ గుప్పుమంటోంది.

ఈ సినిమాలో విలక్షణ నటుడు మోహన్ బాబు నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. బొమ్మన్ ఇరానీ, జగపతి బాబు, సముద్రఖని, మురళీశర్మ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను విలక్షణ పాత్రల్లో చూపించిన త్రివిక్రమ్ మళ్లీ అదే పాట్రన్ లోనే మహేష్ సినిమాలో ఓపాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఆ పాత్ర కోసం మోహన్ బాబుని సంప్రదించారని..  ఇంకా అటు నుంచి రెస్పాన్స్ రావాల్సి వుందని టాక్. త్రివిక్రమ్ అడిగితే మోహన్ బాబు కాదనరు. మహేష్ సినిమాలో మోహన్ బాబు.. ఫిక్సైపోవాల్సిందేనని అభిమానులు అనుకుంటున్నారు.