కరోనా నుంచి దేశం కోలుకుంతోంది.

దేశంలో వరుసగా మూడోరోజు కొత్త కేసులు మూడులక్షలకు దిగువనే నమోదయ్యాయి. పరీక్షల సంఖ్య తగ్గడంతో రోజువారీ కేసులు తగ్గినప్పటికీ.. పాజిటివిటీ రేటు మాత్రం అమాంతం పెరిగి 20 శాతానికి సమీపించింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,86,384 కొత్త కేసులు నమోదయ్యాయి. ముందురోజు కంటే కేసులు స్వల్పంగా పెరిగాయి.

అంతకుముందు 16 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరింది. కేరళ, కర్ణాటకలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కేరళలో 49వేలు, కర్ణాటకలో 48 వేల మందికి వైరస్‌ సోకింది. ఒక్క కేరళనే 140 మరణాలను నివేదించింది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 573 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 4.03 కోట్ల కరోనా కేసులు రాగా.. 4,91,700 మంది మరణించారు. నిన్నఒక్కరోజే 3,06,357 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తంగా ఇప్పటి వరకు 3.76 కోట్ల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 93.33 శాతానికి చేరింది.