మార్చి 4న రాధేశ్యామ్

కరోనా థర్డ్ వేవ్ భయాలు తొలగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ ఆంక్షలు సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాయిదా పడిన సినిమాలు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించుకుంటున్నాయి. ఈ క్రమంలో ‘రాధేశ్యామ్’ కొత్త రిలీజ్ డేటును మార్చి 4గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. అయితే… ఈ డేట్ అధికారికంగా ప్ర‌క‌టించాల్సివుంది. మార్చి 4న థియేట‌ర్ల‌ను లాక్ చేయ‌మ‌ని డిస్టిబ్యూట‌ర్ల‌కు యూవీ సంస్థ సందేశం పంపింది.

మార్చి 18 లేదా ఏప్రిల్ 28న ఆర్‌.ఆర్‌.ఆర్‌ రాబోతోంది. ఆర్‌.ఆర్‌.ఆర్ కంటే రెండు వారాల ముందే రాధే శ్యామ్ రావాల‌ని ఫిక్స‌య్యింది. దానికి త‌గ్గ‌ట్టుగానే మార్చి 4 రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. నాలుగైదు రోజుల్లో ఈ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్ర‌క‌టిస్తారు. ఫిబ్ర‌వ‌రిలో… ఒమైక్రాన్ త‌గ్గుమొహం ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ముంబై, కర్నాటక ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూని ఎత్తివేశాయి. వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ కు అనుమతులు ఇవ్వనున్నారని తెలుస్తున్నది.