వర్క్ షాప్స్ లోనూ అదే పని

రొమాన్స్ లో మహా ముదురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కూడా ఆమెలో కసి ఏమాత్రం తగ్గలేదు. ఈసారి యంగ్  హీరో సిద్ధాంత్ చతుర్వేదితో రెచ్చిపోయింది. వీరిద్దరు కలిసి నటించిన బాలీవుడ్ చిత్రం ‘గెహ్రైయాన్’ (Gehraiyaan). ఇదో రొమాంటిక్ డ్రామా. ట్రై యాంగిల్ లవ్ స్టోరీ.  మరో హీరోయిన్ గా అనన్య పాండే నటించింది. ‘గెహ్రైయాన్’ ఫిబ్రవరి 11న డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ నేపథ్యంలో దీపికా పదుకొనె, అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు. దీపికా, అనన్య పోటీపడి మరీ.. గ్లామర్ షో చేస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న దర్శకుడు శకున్ బట్రా దీపికా-సిద్దాంత్ చతుర్వేదిల రొమాన్స్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. బోల్డ్ సీన్స్ ను వీరిద్దరు బాగా ఎంజాయ్ చేశారు. సినిమా షూటింగ్స్ కంటే ముందే వర్క్ షాప్స్ నిర్వహించాం. యాక్టర్స్ కంఫర్ట్ గా ఫీలయ్యేందుకు షూటింగ్ ముందు అనేక వర్క్ షాప్స్ నిర్వహించినట్టు తెలిపారు. ఆ సమయంలో రొమాంటిక్ సీన్స్ విషయంలో బాగా ప్రాక్టీస్ దొరికిందని చెప్పుకొచ్చారు.