పెళ్లి వద్దంటున్న నితిన్
టాలీవుడ్ పెళ్లి కానీ ప్రసాదుల్లో యంగ్ హీరో నితిన్ ఒకరు. ఈ యువ హీరోకి ఎప్పుడో పెళ్లీడు వచ్చింది. అది పోయే వయసు కూడా దగ్గరపడుతుంది. అయినా.. ఇప్పటి వరకు పెళ్లి మాట ఎత్తడు. కానీ, వరుసగా పెళ్లి నేపథ్యంలో సినిమాలు చేసుకొంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో నటిస్తున్నారు. రాశీఖన్నా హీరోయిన్. పెళ్లి చుట్టూ తిరిగే కథ ఇది. ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ విగ్నేష్ దర్శకత్వంలో వస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
ఈ సినిమా తర్వాత నితిన్ ‘ఛలో’ దర్శకుడు వెంకీ కడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు ‘భీష్మ’ అనే టైటిల్’ని ఖరారు చేశారు. ఇది కూడా పెళ్లి కాన్సెప్ట్ తో తెరకెక్కనుంది. ఐతే, ఇందులో పెళ్లి చేసుకోవద్దనే పాయింట్ ని హైలైట్ చేయనున్నారంట. దాన్ని పూర్తి వినోదాత్మకంగా చూపించబోతున్నారు. ‘ఛలో’ సినిమాతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు దర్శకుడు వెంకీ కడుములు. నితిన్ ‘భీష్మ’లోనూ పెళ్లి కాన్సెప్ట్ తో కామెడీ చేయబోతున్నాడని తెలుస్తోంది.
టాలీవుడ్ లో ప్రభాస్ తర్వాత స్థానం నితిన్ దే. అదే పెళ్లికానీ ప్రసాదుల స్థానంలో. వరుణ్ తేజ్, నారా రోహిత్.. వంటి యంగ్ హీరోలని మీ పెళ్లెప్పుడు ? అని ఎవరైనా అడిగితే.. ప్రభాస్, నితిన్ ల పెళ్లి కానీవ్వండీ. అప్పుడు చేసుకొంటామని సెటైర్లు వేస్తున్నారు. వీరిద్దరిలో ప్రభాస్ అసలు పెళ్లి మాటే ఎత్తడం లేదు. నితిన్ మాత్రం రియల్ లైఫ్ లో పెళ్లి మాట ఎత్తకున్నా., తెరపై మాత్రం వరుసగా పెళ్లి కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నాడు. మరీ.. రియల్ లైఫ్ లో ఈ యంగ్ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకొంటాడన్నది చూడాలి..