హైకోర్టుకు చేరిన తిరుమల వ్యవహారం…!!
తిరుమలను పురావస్తు శాఖ పరిదిలోకి అప్పగించాలంటూ గతంలో టీటీడీకి పురావస్తుశాఖ లేక రాసిన సంగతి తెలిసిందే. ఎట్టిపరిస్థితుల్లో అలా చేసేది లేదంటూ ఏపీ ప్రభుత్వం, టీటీడీ బోర్డు స్పష్టం చేయడంతో కొంతకాలం వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా మళ్లీ పురావస్తు వ్యవహారం తెరపైకి వచ్చింది. టీటీడీని పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకురావాలంటూ న్యాయపోరాటం ప్రారంభమైంది.
టిటిడి ఆదాయ, వ్యయాలు, ఆభరణాల వ్యవహారంపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. తిరుమలలో నేలమాలిగలు, గుప్త నిధుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలంటూ గుంటూరుకు చెందిన అనీల్, గుజరాత్ కు చెందిన భూపేంద్ర గోస్వామి హైకోర్టును ఆశ్రయించారు. టిటిడి పురాతన కట్టడాలపై మే 4 న కేంద్ర పురావస్తు శాఖ రాసిన లేఖను పునరుద్ధరించాలని పిటిషనర్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు.