#UnionBudget2022 : 4 ప్రధాన సూత్రాలు ఆధారంగా.. 7 రంగాలపై ఫోకస్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈసారి కూడా కాగిత రహిత బడ్జెట్ ను ఆమె సమర్పించారు. వచ్చే 25 ఏళ అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాది అని నిర్మలమ్మ అభివర్ణించారు. కోవిడ్ కట్టడి, వాక్సినేషన్ కార్యక్రమం బాగా ఉపయోగపడిందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో టీకా కీలక పాత్ర పోషించిందన్నారు. మౌలిక సౌకర్యాలు..టీకాలు.. ఆర్థిక రంగ విస్తరణలో కీలకపాత్ర పోషించాయి. ప్రైవేటీకరణలో భాగంగా ఎయిర్ ఇండియాను ప్రభుత్వం బదలాయించింది. త్వరలోనే ఎల్ ఐసీ ఐపీవోను తీసుకొస్తాం. 2021-2022లో ఆర్థికంగాకోలుకున్నాం. ఈ బడ్జెట్ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది అన్నారు.
నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్ ను రూపొంచినట్టు నిర్మలమ్మ తెలిపారు. ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ది, అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం ఆధారంగా బడ్జెట్ ని తీసుకొచ్చామని చెప్పారు. తాజా బడ్జెట్ లో ప్రభుత్వం ప్రధానంగా 7 రంగాలపై దృష్టి సారించినట్టు నిర్మలమ్మ తెలిపారు. పీఎం గతిశక్తి, అభివృద్ధి, ఉత్పాదక, అవకాశాలు, శక్తి వనరులు, వాతావరణ మార్పులపై అధ్యయనం, పెట్టుబడులకు చేయూత లాంటి మొత్తం ఏడు అంశాలపై దృష్టిసారిస్తాం అని మంత్రి తెలిపారు.