జగన్’ని కలవనున్న మహేష్.. చిత్తూరు ఎంపీ స్థానానికి పోటీ !
వివాదాస్పద సినీ, రాజకీయ విశ్లేషకుడు మహేష్ కత్తి తన పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని చెప్పారు. ఐతే, ఏ పార్టీ చేరుతాననేది ఇంకా చెప్పాలేను.. అంటూనే త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని కలుస్తానని తెలిపారు మహేష్. దీంతో ఆయన వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైంది చెబుతున్నారు. సొంత జిల్లా చిత్తూరుకు నా వంతు సేవ చేయాలనే ఉద్దేశంతోనే చిత్తూరు ఎంపీగా పోటీ చేయాలని అనుకొంటున్నానని మహేష్ తెలిపారు.
ఇప్పటికే మహేష్ కత్తి వివాదాలకు అతీతుడు అనే పేరు తెచ్చుకొన్నాడు. ముఖ్యంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అతని అభిమానులతో మహేష్ పెద్ద యుద్దమే చేశారు. ఇలాంటి వివాదాస్పద వ్యక్తిగా పేరున్న మహేష్ కత్తిని జగన్ తన పార్టీలో చేర్చుకొంటాడా ? అన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ జగన్ నో చెబితే.. మహేష్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మొత్తంగా మహేష్ కత్తి పొలిటికల్ ఎంట్రీ ఖరారైందని చెప్పవచ్చు. అదే పార్టీతో అన్నది మాత్రమే తెలియాల్సి ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మహేష్ కత్తి టార్గెట్ చేయడం వెనక ఇలాంటిది ఏదో ఉంటుందనే ప్రచారం అప్పట్లో జరిగింది. కేవలం పబ్లిసిటీ కోసమే మహేష్ పవన్ అభిమానులతో పెట్టుకొంటున్నాడనే విమర్శలొచ్చాయ్. నిజానికి పవన్ తో పెట్టుకోవడం కారణంగా మహేష్ పేరు తెచ్చుకొన్నాడు. ఇప్పుడా పేరుతోనే పొలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరీ.. మహేష్ కత్తి రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.