శేఖర్.. కిన్నెర సాంగ్ విన్నారా ?

రాజశేఖర్  హీరోగా నటిస్తున్న చిత్రం  ‘శేఖర్’. ఈ సినిమాకి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించనున్నారు. కాగా ఈ సినిమా  ఫస్టులుక్ తో అందరిలో ఆసక్తి నెలకొంది.  ఈరోజు రాజశేఖర్ పుట్టినరోజు  సందర్భంగా చిత్రంలోని లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.

‘ఓసన్నజాజి తీగలా అల్లుకోవే నన్నిలా .. కిన్నెరా .. ఓ కిన్నెరా అంటూ సాగే ఈ పాటను అనంత శ్రీరామ్ సాహిత్యంతో అనూప్ రూబెన్స్ స్వరపరచగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఈ పాట మొదటిసారి వినగానే నా హృదయాన్ని తాకింది.