యంగ్ కమెడియన్ షాకింగ్ డిసిషన్
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో వెలుగులోకి వచ్చాడు రాహుల్ రామకృష్ణ. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో స్టార్ నటుడుగా ఎదిగాడు. చిన్న సినిమాల నుంచి ఇప్పుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించే స్థాయికి చేరుకున్నారు.
ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్న రాహుల్ రామకృష్ణ సడెన్ షాక్ ఇచ్చాడు. “2022 తర్వాత సినిమాలు మానేస్తున్నా” అంటూ ట్విట్ చేశాడు. దానికి గల కారణాలు ఏంటీ ? అన్నది మాత్రం చెప్పలేదు. దీంతో ఈ యంగ్ కమెడియన్.. సీరియస్ గా రిటైర్మెంట్ ప్రకటించాడా ? లేక సిల్లీగా పోస్ట్ పెట్టాడా ? అని చర్చించుకుంటున్నారు.
2022 is my last.
I will not do films anymore.
Not that I care, nor should anybody care— Rahul Ramakrishna (@eyrahul) February 4, 2022