కేంద్రానికి కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు

కేంద్రంపై యుద్ధం ప్రకటించారు సీఎం కేసీఆర్. సోమవారం జనగామ కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఢిల్లీ కోటలు బద్ధలు కొట్టడానికి సిద్ధమని ప్రకటించారు. మమ్మల్ని ముట్టుకుంటే అడ్రస్‌ లేకుండా చేస్తామని హెచ్చరించారు. అవసరం అయితే ఢిల్లీ దాకా వస్తామని.. దేశ రాజకీయాల్లో పాత్ర పోషించాల్సివస్తే కొట్లాడ్డానికి సిద్దమని కేసీఆర్‌ అన్నారు. 


కేంద్రం కొన్ని సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, గోదావరి నీళ్లతో జనగామ పాదాలు కడిగేందుకు సిద్ధమని, విద్యుత్‌ సంస్కరణల పేరుతో మోడీ పంచాయితీ పెడుతున్నారని అన్నారు. జనగామ ఒకప్పుడు కరువు సీమగా ఉండేదని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కరెంట్, మంచి నీటి ఇబ్బందు లేవని, బచ్చన్నపేటలో బతుకులు బాగుపడ్డాయని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఘనపురం, పాలకుర్తిలో డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. జనగామకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని సీఎం తెలిపారు. మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గంలో 2 వేల కుటుంబాలకు ధళిత బంధు పథకాన్ని ఇస్తామని సీఎం  కేసీఆర్‌ చెప్పారు.