రాధేశ్యామ్ వాలంటైన్స్ గ్లింప్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ప్రేమికులకు గిఫ్ట్ అందింది. వాలెంటైన్స్ డే కానుకగా రాధేశ్యామ్ గ్లింప్స్ విడుదల చేశారు. ప్రభాస్-పూజ హెగ్డే మధ్య లవ్ ప్రపోజల్ సన్నివేశాలతో చిన్నపాటి టీజర్ ని కట్ చేశారు.
“మళ్లీ లైఫ్ లో వాడి మొహం చూడనని పూజ వాయిస్ తో మొదలయ్యే ఈ గ్లింప్స్.. రొమాంటిక్ గా సాగింది. కుక్ చేస్తావ్.. ఇంత బాగా మాట్లాడతావ్.. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లెందుకు కాలేదు ? అని పూజా అడిగితే.. ప్రభాస్ ఇబ్బంది పడుతూ కనిపించాడు. ప్రభాస్ చెప్పిన పూర్తి ఆన్సర్ ఏంటీ ? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
రాథాకృష్ణ కె కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ తెరకెక్కింది. ఈజిప్ట్ బ్యాక్ డ్రాప్ లో పూర్వ జన్మల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. మార్చి 11న రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కావాలి. కరోనా కారణంగా వాయిదా పడిన చిత్రాల్లో రాధేశ్యామ్ ఒకటి. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు క్యూ కట్టబోతున్న సంగతి తెలిసిందే. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పరిట్ సినిమాలు రాబోతున్నాయి.