ఉక్రెయిన్‌ను వీడండి భారతీయులకు.. హెచ్చరిక
ఉక్రెయిన్ ప్రై రష్యా దాడి చేయడం ఖాయమని పలు దేశాలు విశ్వసిస్తున్నాయి. ఈ జాబితాలో ఈ దేశాల జాబితాలో అమెరికా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, ఐర్లాండ్, బెల్జియం, లక్సంబర్గ్, ది నెదర్లాండ్స్, కెనడా, నార్వే, ఇస్తోనియా, లిథువేనియా, బల్గేరియా, స్లొవేనియా, ఆస్ట్రేలియా, జపాన్, ఇజ్రాయెల్, సౌదీ, యూఏఈ తో భారత్ కూడా ఉంది.
ఉక్రెయిన్‌లో నివసించే భారతీయులు వీలైతే దేశాన్ని వీడాలని ప్రభుత్వం సలహా ఇచ్చింది. ఈ మేరకు కీవ్‌లోని భారత దౌత్యకార్యాలయం ఓ ప్రకటన చేసింది. రష్యా మద్దతు ఉన్న బలగాలు డాన్‌బాస్ ప్రాంతాన్ని నియంత్రిస్తున్నాయి.
గత 48 గంటలుగా రష్యా దళాలు సరిహద్దుల వద్ద మోహరింపులను పెంచాయి. ఈ విషయం బెల్జియంకు చెందిన ఓ సంస్థ ఉపగ్రహ చిత్రాలతో సహా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ లో ఉన్న తమ దేశస్థులను రక్షించుకొనే చర్యలు చేపడుతున్నాయి.