బచ్చన్ పాండే ట్రైలర్.. వెయిటింగ్ !

ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రం ‘బచ్చన్ పాండే’. తమిళ హిట్ ‘జిగర్తాండ’కు రిమేక్ ఇది. అక్షయ్ కి జంటగా కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు. సాజిద్ నడియాద్వాలా నిర్మాత. మార్చి 18న బచ్చన్ పాండే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ నెల 18న ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ ప్రమోషన్స్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నయి. ఓ వైపు అక్షయ్ రగడ్ లుక్ లో భయంకరంగా కనిపిస్తూనే.. మరోవైపు కృతి సనన్ ను బైక్ పై కూర్చో బెట్టుకొని రొమాంటిక్ మూడ్ లో కనిపిస్తున్నాడు. ‘జిగర్తాండ’ తెలుగులో గద్దలకొండ గణేష్ గా రిమేక్ అయింది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్  హీరోగా నటించారు. గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ అదరగొట్టేశాడు. అయితే తెలుగు వర్షన్ లో రొమాన్స్ కి పెద్దగా స్కోప్ లేదు. కానీ బాలీవుడ్ రిమేక్ లో అక్షయ్ – కృతి ల మధ్య లవ్ ట్రాక్ కాస్త డీప్ గానే పెట్టినట్టు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో రేపు రాబోతున్న బచ్చన్ పాండే ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.