సామ్-పూజా.. అద్భుతం

ఎనిమిదేళ్ల తర్వాత పూజాహెగ్డే కోలీవుడ్‌లో నటిస్తున్నారు. విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘బీస్ట్‌’లో లీడ్‌ రోల్‌ పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘అరబిక్‌ కుత్తు’ పాట విడుదలై సూపర్‌ హిట్‌ అందుకుంది. 5 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోన్న ఈ పాటకు సమంత తాజాగా డ్యాన్స్‌ చేశారు.

లేట్‌ నైట్‌ ప్రయాణం చేస్తోన్న ఆమె ఎయిర్‌పోర్ట్‌లో ‘అరబిక్‌ కుత్తు’కు డ్యాన్స్‌ చేసి ఆ పాట రిథమ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నట్లు చెప్పారు. సాంగ్‌ సూపర్‌గా ఉందని ‘బీస్ట్‌’ టీమ్‌ని ప్రశంసించారు. కాగా, ఈ వీడియో చూసిన పూజాహెగ్డే ఎంతో ఆనందించారు. సామ్‌ డ్యాన్స్‌ వీడియోని ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేస్తూ.. “అద్భుతం” అని మెచ్చుకున్నారు. దీంతో.. ఈ భామల మధ్య గతంలో స్వల్ప మనస్పర్థలు సమసి పోయినట్టయింది.

. @Samanthaprabhu2 vibing for the #ArabicKuthu 😍❤️❤️!

. @actorvijay #Beast #SamanthaRuthPrabhu #Samantha pic.twitter.com/9OpEE879nu— Trends Samantha™ (@Trends_Samantha) February 17, 2022