జగ్గారెడ్డి రాజీనామా డ్రామా

కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు తెలిపాడు. మొదట కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాస్తానని, తాను ఎందుకు రాజీనామా చేస్తున్నానో.. అందులో వివరిస్తానని చెబుతున్నాడు. అయితే ఇదంతా ఒట్టి డ్రామానే. ఆయన కాంగ్రెస్ ను వీడడు. కేవలం.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కారణంగా పార్టీలో ఎవరు సంతృప్తిగా లేరనే సంకేతాలు ఇచ్చేందుకు చేస్తున్న కుట్రలో భాగమే ఇదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వాస్తవానికి జగ్గారెడ్డి చాన్నాళ్లుగా టీఆర్ ఎస్ కు సన్నిహితంగా, సొంత పార్టీకి దూరంగా మెసులుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి కారెక్కుతారనే ప్రచారం ఉంది. దాన్ని ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తున్న వస్తున్న జగ్గారెడ్డి… శనివారం ఓపెన్ అయిండు. పార్టీకి రాజీనామా చేయబోతున్నా. తనని టీఆర్ ఎస్ కోవర్ట్ అనడం తట్టుకోలేపోతున్నా.. అని చెబుతున్నాడు. రాజీనామా చేసేటోడు అయితే… నేరుగా రాజీనామా చేస్తుడు. కానీ మొదట లేఖ రాసి.. తర్వాత రాజీనామా చేస్తా అనడం వెనక.. టీఆర్ ఎస్ లో కాంగ్రెస్ లో విలీనం చేసే ప్లాన్ దాగి ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది.