నితీష్ కుమార్ తో పీకే భేటీ.. ఏంటి సంగతి ?
గతంలో తన వారసుడిగా ప్రశాంత్ కిషోర్ ను ప్రకటించారు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. పార్టీలో చేర్చుకొని కీలక పదవి ఇచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వీరి మధ్య చెడింది. నితీష్ కు బీజేపీ దూరంగా జరిగిన పీకే.. కాంగ్రెస్ కు దగ్గరైనట్టు కనిపించింది. కానీ అక్కడ కూడా ఆయనకు ఆశించిన హోదా దక్కకపోవడంతో.. ప్రాంతీయ పార్టీలతో కలిసి వ్యూహాలు రచిస్తున్నారు.
ఈ క్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్రం సీఎం ఉద్దవ్ థాక్రే.. ఇలా అందరిని ఒకటి చేసే ప్రయత్నంలో పీకే ఉన్నట్టు తెలుస్తుంది. ఇలాంటి టైమ్ లో పీకే సడెన్ షాక్ ఇచ్చారు. తన మాజీ బాస్‌తో, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పీకే భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి భోజనం కూడా చేశారు. 2020 లో ప్రశాంత్ కిశోర్ జేడీయూకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత.. వీరిద్దరూ కలుసుకోవడం ఇదే ప్రథమం.
ఈ భేటీపై స్పందించిన సీఎం నితీశ్ తమ మధ్య పాత స్నేహం ఉందని, అందుకే కలుసుకున్నాం. ఇది కేవలం భోజనం సమావేశం మాత్రమేనని చెప్పుకొచ్చారు. పీకే కూడా ఇదే చెప్పారు. ఇది కేవలం మర్యాద పూర్వక భేటీయే. మామూలు అంశాలపైనే మాట్లాడుకున్నామని చెప్పారు.