ఆర్ ఆర్ ఆర్ కొత్త అప్డేట్స్ ఎప్పుడంటే..!

దర్శక ధీరుడు రాజమౌళీ దర్శకత్వం వహించిన సినీమా  ‘ఆర్ఆర్ఆర్’.. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడింది. ఆయితే తాజాగా  ఈసారి ఎలాగైనా వచ్చేస్తాం అంటూ ఓ ముహుర్తాన్ని కూడా ప్రకటించారు చిత్ర యూనిట్. . ముందు మార్చి 18 లేదా ఏప్రిల్ 28 ఈ రెండు తేదీల్లో రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. మార్చి 25న ట్రిపుల్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుందని తెలిపారు.

అయితే.. ఆర్ఆర్ఆర్ అండ్ టీం ప్రస్తుతం  హడావుడి చేయడం లేదు. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక రెండు మూడు రోజులు హడావుడి కనిపించినా, కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి రెండు వారాలు గడిచినా మరో అప్డేట్ లేదు. జనవరిలో విడుదల సందర్భంగా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చుట్టేసిన టీం ఈసారి ఎందుకో అంతగా హుషారుగా కనిపించడం లేదు.

. ప్రస్తుతం హీరోలిద్దరూ వాళ్ళ వాళ్ళ కొత్త సినిమాల పనిలో ఉన్నారు. అందుకే వాళ్ళు ప్రమోషన్ మొదలు పెట్టలేదు.  కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక రెండు మూడు రోజులు హడావుడి కనిపించినా ఆ తర్వాత మాత్రం మధ్యలో ఎలాంటి అప్డేట్స్ లేవు. కానీ ఈలోగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు చాలా స్కోప్ ఉంది. కానీ.. ప్రస్తుతానికి అయితే సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. అయితే మార్చ్ 9న, మార్చి 14న రెండు బిగ్ అప్డేట్స్ రాబోతున్నట్టు  సినీ వర్గాల సమాచారం.