రష్మిక తో పెళ్లి.. రౌడీ రిప్లై !
రౌడీ హీరో విజయ్ దేవరకొండ – రష్మిక మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని ఎప్పటి నుంచో రూమర్స్ ఉన్నాయి. సోమవారం మళ్ళీ ఆ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఈ ఏడాది చివరిలో విజయ్, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. ప్రముఖ వెబ్ పోర్టల్స్ కూడా ఈ వార్తని ప్రచురించాయి. దీంతో ఈ వార్త నిజమేనని రౌడీ ఫ్యాన్స్ నమ్మేశారు.
ఈ ప్రచారంపై స్పందించిన విజయ్.. “ఎప్పటిలానే నాన్సెన్స్. డోంట్ వీ జస్ట్.. లవ్.. న్యూస్” అని ట్వీట్ చేశాడు. దీంతో విషయం ప్రస్థావించకుండానే వివరణ ఇచ్చినట్లయింది.విజయ్-రస్మిక తొలిసారి గీత గోవిందం సినిమా కోసం జతకట్టారు. ఆ వెంటనే డియర్ కామ్రెడ్ సినిమా కోసం కలిసి పని చేశారు. అప్పటి నుంచి వీరిద్దరు మధ్య లవ్ మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లైగర్ తో బిజీ గా వున్నాడు విజయ్. అటు రష్మిక కూడా తన బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా వుంది.
As usual nonsense..
Don’t we just
❤️ da news!— Vijay Deverakonda (@TheDeverakonda) February 21, 2022