బంగారు భారత్ – కేసీఆర్ నయా స్లోగన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ప్రాంతీయ పార్టీలన్నింటికి ఏకం చేసి.. బీజేపీ రహిత భారత్ ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. ఆదివారం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. మహా సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు నారాయణ ఖేడ్ చేరుకున్న సీఎం.. రూ.సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల పథకాల శిలాఫలకాలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావించిన సీఎం కేసీఆర్ కొత్త స్లోగన్ ఇచ్చారు. బంగారు భారత్‌ను రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలి. భారత్‌ను అమెరికా కంటే గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. ఇప్పటివరకు మన విద్యార్థులు అమెరికా వెళ్లేవారు. విదేశీ విద్యార్థులే భారత్‌కు వచ్చే విధంగా అభివృద్ధి జరగాలి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశాన్ని బాగు చేసుకుందామని అన్నారు.