నరేష్ మూడో భార్యపై కేసు
సీనియర్ నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై పోలీస్ కేసు నమోదైనట్టు తెలుస్తుంది. డబ్బు వసూళ్లకు సంబంధించి రమ్య రఘుపతిపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఐదురుగురు మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
హైదరాబాద్, అనంతపూర్, హిందూపురంలలో రమ్య భారీగా డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. అయితే రమ్య రఘుపతి అనే మహిళ చేస్తున్న వసూళ్లతో తనకెలాంటి సంబంధం లేదని నరేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఉండటం లేదు కూడా.
అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి సోదరుని కుమార్తె రమ్య రఘుపతి. ఈమె ఆస్ట్రేలియాలో ఫిలిం మేకింగ్ కోర్స్ పూర్తి చేసింది. ఆ తర్వాత దర్శకుడు నీలకంఠ దగ్గర నందనవనం సినిమాకి అసిస్టెంట్‌గా పని చేస్తున్నప్పడు నరేష్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం నరేష్ తల్లి విజయ నిర్మల దగ్గర కో డైరెక్టర్‌గా కూడా పని చేసింది. అప్పుడే నరేష్, రమ్య మధ్య ప్రేమ చిగురించింది.
ఇరు కుటుంబాల వారిని ఒప్పించి నరేష్, రమ్య వివాహం చేసుకున్నారు. మూడో పెళ్లి సమయానికి నరేష్‌కు 50 ఏళ్లు, రమ్యకు ఆయనలో సగం వయసు. వీరికి రణవీర్ అనే కొడుకు ఉన్నాడు. ఆ తర్వాత వాళ్లిద్దరి విభేదాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం విడి విడిగా ఉంటున్నారు. అయితే నరేష్ ఆస్తుల్లో తనకు భాగం వుందంటూ, పలువురి నుంచి ఆమె డబ్బులు వసూలు చేస్తుండటం.. పోలీస్ కేసు వరకు వెళ్లింది.