బావ సినిమా బాగుంది.. పూనమ్ చాటింగ్ !
హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్లకు అర్థాలే వేరులే. ఆమె ట్విట్లన్నీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సంబంధించినవే ఉంటాయ్. అవి కూడా పరోక్షంగా. ఆమె ట్విట్లలో ఒక్కోసారి ప్రేమ కనిపిస్తుంటుంది. మరోసారి ద్వేశం కనిపిస్తుంటుంది. ఇంకోసారి ఆమె కన్పూజన్ లో ఉన్నట్టు అర్థమవుతుంది. అదే సమయంలో పవన్ స్నేహితుడు, టాప్ దర్శకుడు అంటూ.. విపరీతమైన కోపం చూపిస్తుంటుంది. అయితే పవన్ తో ఆమెకు ఉన్న సంబంధం ఏంటీ ? అన్నది సమాధానం లేని ప్రశ్న.
శుక్రవారం భీమ్లా నాయక్ విడుదల సందర్భంగా ఆమె షేర్ చేసిన వాట్సాప్ చాటింగ్ ను బట్టి చూస్తే.. పవన్ ను ఆమె ప్రియురాలు.. పెళ్లాంలా ఫీలవుతున్నట్టు కనబడుతుంది. ఎవరో పవన్ అభిమాని. మ్యాగీ అనే పేరుతో పూనమ్ కౌర్ ఫీడ్ చేసుకున్న కాంట్రాక్ట్. వాట్సాప్ లో పూనమ్ కు హాయ్ చెప్పి, ‘సినిమాకు వచ్చా అక్కా…బావ సినిమాకు’ అంది. హానెస్ట్ రివ్యూ ఇవ్వమని పూనమ్ కోరింది. హిట్ అక్కా.. సిన్సియర్.. ప్రామిస్ అంది. అక్కడితో అయిపోలేదు. దీంతో పూనమ్ పవన్ ను అనఫిషియల్ భర్తగా ఆరాధిస్తున్నట్టు కనబడుతుంది.