భీమ్లా నాయక్.. రెండు కల్ట్ సీన్స్ మిస్ !

పవన్-రానా కలిసి నటించిన చిత్రం భీమ్లా నాయక్. మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రిమేక్ ఇది. తెలుగు వర్షన్ లో కొన్ని కొన్ని మార్పులు చేసినా.. మాతృక మేజిక్ రిపీట్ చేయడంలో విజయవంతం అయ్యారు. అయితే మాతృకలోని రెండు కల్ట్ సీన్స్ మాత్ర మిస్ అయ్యాయి. “హీరో బస్సు దిగుతాడు. లుంగీ పైకి ఎగ్గడతాడు. అలా రోడ్డుపై నడుచుకుంటూ వస్తాడు. నడుస్తూ చెప్పులు వదిలేస్తాడు. అడ్డొచ్చిన వ్యక్తిని కొడతాడు. బుల్డోజర్ తో కట్టడాన్ని కూల్చేస్తాడు.” ఈ సన్నివేశం అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకే హైలెట్. తెలుగు వర్షన్ లో ఈ సీన్ మిస్ అయింది.

క భీమ్లా నాయక్ లో మిస్సయిన మరో కల్ట్ సీన్ బైక్ పై ఇద్దరూ వెళ్లే సన్నివేశం. కోషి కారు చెడిపోతుంది. అడవిలో మరో వాహనం కనిపించక నడుస్తూ, అలిసిపోతాడు. అప్పుడు అయ్యప్పన్ నాయర్ తన బండిపై అటుగా వస్తాడు. కోషితో తనకు శత్రుత్వం ఉన్నప్పటికీ పరిస్థితి చూసి లిఫ్ట్ ఇస్తాడు. ఇద్దరూ కలిసి ఒకే బైక్ పై వెళ్లడం, అక్కడ కోషి రియాక్షన్ లాంటివి ఒరిజినల్ వెర్షన్ లో భలేగా క్లిక్ అయ్యాయి. ఈ సీన్ భీమ్లానాయక్ లో రిపీట్ అవ్వలేదు.