భీమ్లా నాయక్ తో తారక్ హిట్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాకు ఏపీ ప్రభుత్వం కావాలనే ఇబ్బందులకు గురి చేసింది. టికెట్ రేట్స్ పెంచలేదు. స్పెషల్ షోస్ కి పర్మిషన్ ఇవ్వలేదు. పైగా స్ట్రిక్ట్ రూల్స్ అంటూ థియేటర్స్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ఆ కఠిన నిబంధనలు పాటిస్తూ.. థియేటర్స్ నడపలేమని కొందరు మూసేశారు కూడా. ఈ నేపథ్యంలో ప్రజల మద్దతు పవన్ కు దక్కింది. అదే సమయంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ చంద్రబాబు కూడా పవన్ సినిమాకు అన్యాయం అంటూ నోరు విప్పారు.
ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన మంత్రి పేర్ని నాని.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు.పవన్ కల్యాణ్ సినిమా విషయంలో ఇంత ఓవర్ యాక్షన్ చేసిన చంద్రబాబు-లోకేష్ గతంలో ఎప్పుడైనా ఎన్టీఆర్ మూవీ విషయంలో కనీసం ఓ ట్వీట్ అయినా వేశారా అని మంత్రి ప్రశ్నిస్తే, నిజంగా అభిమానులు కూడా ఆలోచనలో పడ్డారు. బాలకృష్ణ సినిమాలని సపోర్ట్ చేసే పెదబాబు-చినబాబు.. జూనియర్ ఎన్టీఆర్ ని ఎందుకు పట్టించుకోరనే లాజిక్ జనాల్లోకి బలంగా వెళ్లింది. ఇప్పటికే కుప్పంలో జూనియర్ జెండా ఎగిరేసరికి టీడీపీ నాయకులు గజగజ వణుకుతున్నారు. దీంతో భీమ్లా నాయక్ విడుదల వేళ తారక్ హిట్ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ కు ప్రీ పబ్లిసిటీ దొరికింది.