OTT బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్

బిగ్ బాస్ ఇప్పుడు ఓటీటీలో కొత్త సంచలనం సృష్టించబోతోంది. స్టార్ మా లో పరిమితమైన వ్యవధిలో వినోదాన్ని పంచి సంచలన విజయాన్ని అందుకున్న బిగ్ బాస్ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలు ఓటీటీ లో ప్రారంభం అవుతోంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు ప్రారంభం కాబోతుంది.

కింగ్ నాగార్జున “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లోనూ బిగ్ బాస్ ని నడిపించబోతున్నారు. బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ ఎవరు ? అన్నది ఇప్పటి వరకు సస్పెన్స్ గా ఉంది. ఫిబ్రవరి 26 న సాయంత్రం 6 గంటలకు మాత్రమే అది తెలియనుంది. కొందరు మాజీ కంటెస్టెంట్స్, మరికొందరు కొత్త కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ ఓటీటీ కలర్ ఫుల్ గా ఉండబోతుందని సమాచారమ్.