ఆంధ్రాలో తెలుగు సినిమాలు బ్యాన్ చేయండి
కావాలనే ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ ను ఇబ్బంది పెడుతుంది. పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అవుతుందనే కొత్త జీవో ఇంకా విడుదల చేయలేదన్నారు మెగా బ్రదర్ నాగబాబు. సినీ పరిశ్రమపై ఏపీ ప్రభుత్వ వైఖరిపై సోమవారం మరో వీడియో విడుదల చేశారు నాగబాబు.
పవన్‌కల్యాణపై కక్ష సాధించడం కోసమే ‘భీమ్లానాయక్’ రిలీజ్‌ని దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవో రిలీజ్ చేయలేదన్నారు. సామాన్యుడికీ సినిమా టికెట్ ధరలు అందుబాటులోకి రావాలని మీరు అంటున్నారు.
నటీనటుల పారితోషికాలు సినిమాకి పెట్టిన ఖర్చులో భాగం కాదంటున్నారు. సినిమాకి పెట్టే మొత్తం ఖర్చులో కేవలం 12 నుంచి 20శాతం మాత్రమే హీరోలకు పారితోషికంగా ఇస్తాం.
తమ సినిమా కనుక పరాజయం పొందితే హీరోలు పారితోషికాన్ని తగ్గించుకుంటారు. కొన్నిసార్లు వెనక్కి ఇచ్చేస్తారు. మా అన్నయ్య, పవన్, ఎన్టీఆర్, మహేశ్, ప్రభాస్.. ఇలా ఎంతోమంది హీరోలు.. తమ సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆడనప్పుడు నిర్మాతకు బాసటగా ఉండటానికి పారితోషికాన్ని తగ్గించుకున్నవారే.
ఆంధ్రప్రదేశ్‌లో ఏ వ్యాపారాన్నైనా మీ చేతుల్లోకే తీసుకుంటున్నారు కదా.. అలాగే సినిమా పరిశ్రమని సైతం ఆంధ్రా వరకూ మీరే తీసుకోండి. లేదంటే ఆంధ్రాలో తెలుగు సినిమాలు బ్యాన్ చేసేయండి. కొన్నిరోజులు నష్టపోతాం. వేరే దారి చూసుకుని మా సినిమాలు విడుదల చేస్తాం. యూట్యూబ్, ఓటీటీ చూసుకున్న మాకు డబ్బులు వస్తాయని నాగబాబు అన్నారు.